చరణ్‌కు జోడీగా లస్ట్‌ స్టోరీస్‌ భామ..? - Kiara Advani to share screen with Ram Charan in Acharya
close
Published : 07/12/2020 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరణ్‌కు జోడీగా లస్ట్‌ స్టోరీస్‌ భామ..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు జోడీగా ‘లస్ట్‌ స్టోరీస్‌’ భామ కియారా అడ్వాణీ నటించబోతుందా..? అవుననే అంటున్నాయి టీటౌన్‌ వర్గాలు. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో చిరు తనయుడు చరణ్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. సినిమాలో కీలక పాత్రలో కనిపించే చరణ్‌కు జోడీగా నటించబోయేది ఎవరన్నది మాత్రం చిత్రబృందం ఇంకా స్పష్టం చేయలేదు. గతంలో కన్నడ భామ రష్మిక, సమంత, సాయిపల్లవి ఇలా.. కొన్ని పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే.. చిత్రబృందం మాత్రం బాలీవుడ్‌వైపు మొగ్గు చూపించిందట. చరణ్‌కు జోడీగా ఓ బాలీవుడ్‌ భామను తీసుకొస్తే బాగుంటుందని భావిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లతో ఓ లిస్టు తయారు చేసి.. చివరికి కియారా అడ్వాణీని ఎంపిక చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుంది. లాక్‌డౌన్‌కు ముందే ఆమె సినిమాకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే కాజల్‌ కూడా సెట్లోకి కాలుపెట్టే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న కియారా తెలుగులో ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసింది. ఆమెకు తెలుగులో ఇది మూడో చిత్రం. దీంతో పాటు.. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలోనూ కియారా హీరోయిన్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ వార్తలపై చిత్రబృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కియారా టాలీవుడ్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనుందా లేదా తెలుసుకోవాలంటే.. అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి..!

 

ఇవీ చదవండి..

అది అమ్మ సురేఖ కల: రామ్‌ చరణ్‌

ఎన్టీఆర్‌ సరసన కియారా అడ్వాణీ?

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని