close

తాజా వార్తలు

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది

ముంబయి: ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘గుడ్‌న్యూస్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమెతోపాటు కరీనాకపూర్‌, అక్షయ్‌కుమార్‌, దిల్జిత్‌ దొసాంజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘షేర్‌ షా’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు కూడా కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. బాలీవుడ్‌ అగ్ర నిర్మాతైన కరణ్‌తో కలిసి పనిచేయడం గురించి కియారా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు.

‘ధర్మా ప్రొడక్షన్స్‌ వారితో కలిసి అద్భుతమైన చిత్రాల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బ్యానర్‌లో నేను నటించిన ప్రతి చిత్రం కూడా దేనికదే విభిన్నమైనది. అలాగే ప్రతి సినిమా కూడా నా హృదయాన్ని హత్తుకుంది. కరణ్‌కు నా మీద నమ్మకం ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కరణ్‌కు కామెడీలో మంచి టైమింగ్‌ ఉంది. ‘తఖ్త్‌’ తర్వాత ఓ కామెడీ సినిమాకు దర్శకత్వం వహించమని చాలాసార్లు కరణ్‌కు చెప్పాను. భవిష్యత్తులో కరణ్‌ ఓ కామెడీ సినిమా చేస్తాడని.. అందులో నన్ను కూడా భాగం చేస్తారని నేను భావిస్తున్నాను.’ అని కియారా అడ్వాణీ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.