close

తాజా వార్తలు

Published : 22/11/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డిసెంబర్‌ 11న థియేటర్లలో ‘ఇందూ కీ జవానీ: కియారా

ముంబాయి: బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ నటించిన ‘ఇందూ కీ జవానీ’ చిత్రం థియేటర్లో డిసెంబర్‌ 11న విడుదలవుతుందని తాజాగా కియారా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ‘జగ్‌ జగ్‌ జీయో’ చిత్ర షూటింగ్‌ కోసం చండీగఢ్‌లో ఉన్నారు. 

ఈ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదలవుతుందని ఆమె చిత్రం పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా ‘ఇట్స్‌ హ్యాపెనింగ్‌’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ చిత్రం విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి అబీర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఇది మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రం. ప్రస్తుత పరిస్థితుల్లోని ఆన్‌లైన్‌ డేటింగ్‌ అప్లికేషన్స్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కథ మొత్తం ఇందూ గుప్తాగా నటించిన కియారా పాత్ర చుట్టూ నడుస్తుంది. అలాగే ఆదిత్యా సీల్‌ పాత్ర ఆకట్టుకుంటుందని తెలిపారు. 

ఇటీవలే ఆమె ‘జగ్‌ జీవన్‌ జీయో’ ఫస్ట్‌ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్, నీతు కపూర్‌, అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.