కోహ్లీ 1, రోహిత్‌ 2, ఫించ్‌ 5, స్మిత్‌15 - Kohli stays on top of ICC ODI ranking for batsmen
close
Published : 10/12/2020 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ 1, రోహిత్‌ 2, ఫించ్‌ 5, స్మిత్‌15

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు. తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 870 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లో అతడు 89, 63తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గాయంతో జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ రోహిత్‌ శర్మ (842) రెండో స్థానం దక్కించుకున్నాడు. మూడో స్థానంలోని బాబర్‌ ఆజామ్‌ కన్నా ఐదు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు.

టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య తొలిసారి టాప్‌-50లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాపై అదరగొట్టే ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. తొలి వన్డేలో 90, మూడో వన్డేలో 92*తో దుమ్మురేపాడు. 553 పాయింట్లతో 49వ ర్యాంకు సాధించాడు. 2019లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ తర్వాత పాండ్య ఆడిన తొలి వన్డే సిరీసు ఇదే కావడం గమనార్హం. ఇక టీమ్‌ఇండియాపై 114, 60, 75తో రాణించిన ఆసీస్‌ సారథి ఆరోన్‌ ఫించ్‌ ఐదో ర్యాంకులో నిలిచాడు. 791 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నాడు.

వరుస శతకాలతో అదరగొట్టిన ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ 2018 తర్వాత తొలిసారి టాప్‌-20లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం 707 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నాడు. ఇక 194.18 స్ట్రైక్‌రేట్‌తో దుమ్మురేపి 167 పరుగులు చేసిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 20వ స్థానానికి ఎగబాకాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా 700 పాయింట్లతో మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (722), అఫ్గాన్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (701) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమ్‌ఇండియా సిరీసులో ఏడు వికెట్లు తీసిన ఆడమ్‌ జంపా టాప్‌-20లో అడుగుపెట్టాడు. 14వ ర్యాంకు సాధించాడు. 6 వికెట్లు తీసిన జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకుకు ఎగబాకాడు.

ఇవీ చదవండి
‘కింగ్‌కోహ్లీ’.. భూమ్మీద బిజీ క్రికెటర్‌!
నెట్‌బౌలర్‌ నుంచి టీమ్‌ఇండియా పేసర్‌గా..

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని