100శాతం నేనే షూట్‌ చేశా.. కానీ..: క్రిష్‌ - Krish Open Up On Manikarnika Issue
close
Published : 19/12/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100శాతం నేనే షూట్‌ చేశా.. కానీ..: క్రిష్‌

‘మణికర్ణిక’ వివాదం గురించి పెదవి విప్పిన దర్శకుడు

హైదరాబాద్‌: ‘మణికర్ణిక’.. ఝాన్సీలక్ష్మిబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కంగనా రనౌత్‌ కథానాయికగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన సినీ ప్రియుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో కంగన-క్రిష్‌ మధ్య జరిగిన వివాదం ఏమిటి?‘మణికర్ణిక’ దర్శకత్వాన్ని ఉద్దేశిస్తూ అప్పట్లో కంగన ఎందుకు అలా ట్వీట్‌ చేశారు?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతూ సదరు వివాదం గురించి తాజాగా దర్శకుడు క్రిష్‌ స్పందించారు. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్‌ షో ‘సామ్‌ జామ్‌’ తాజాగా ఆయన పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.

‘‘గతేడాది ‘మణికర్ణిక’ విడుదలయ్యింది. ఇప్పటివరకూ ‘మణికర్ణిక’ గురించి నేను పూర్తిగా మాట్లాడలేదు. కేవలం ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఆ తర్వాత సోషల్‌మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. కంగన కూడా ఓ ట్వీట్‌ పెట్టారు. ఇప్పుడు నేను కూర్చున్న ఈ స్థానంలోనే ‘మణికర్ణిక’ మూవీ పూజా కార్యక్రమం అప్పట్లో నిర్వహించాం. దాదాపు 25 రోజులపాటు ఇక్కడే షూటింగ్‌ చేశాం. నిజం చెప్పాలంటే, 91 రోజుల్లో మేమంతా ఎంతో సంతోషంగా ‘మణికర్ణిక’ షూట్‌ పూర్తి చేశాం. కంగనకు, నాకూ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. షూట్‌ అంతా ఎంతో సంతోషంగా గడిచింది.’’

‘‘రీరికార్డింగ్‌ జరుగుతున్న సమయంలో కంగన టీమ్‌ సినిమా చూశారు. ఫస్ట్‌ హాఫ్‌ వాళ్లకి బాగా నచ్చింది. అలాగే సెకండ్ హాఫ్‌ కూడా బాగుందని చెప్పారు. కొన్నిరోజులు గడిచిన తర్వాత కంగన టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. కొన్ని సన్నివేశాలు నచ్చలేదని, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాలేదని చెప్పారు. నేను షూట్‌ చేసిన దాని ప్రకారం సోనూసూద్‌ పోషించిన ‘సదాశివ్‌’ పాత్ర సెకండ్‌ హాఫ్‌లో చివరి 20 నిమిషాల వరకూ ఉంటుంది. కానీ అది వాళ్లకు నచ్చలేదు. సదాశివ్ పాత్రను ఫస్ట్‌హాఫ్‌తోనే ముగించమని చెప్పారు. అది నా వల్ల కాదని ఎందుకంటే ‘మణికర్ణిక’ ఒక చారిత్రాత్మక చిత్రమని చెప్పాను.’’

‘‘అనంతరం కంగన టీమ్‌ సోనూసూద్‌ని కలిసి సినిమాలో తన పాత్రను తగ్గిస్తున్నట్లు, రీషూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన దానికి అంగీకరించలేదు. నాకు ఫోన్‌ చేసి.. ‘నిజంగానే నా పాత్రను రీషూట్‌ చేస్తున్నారా?నీకు ఓకే అయితే నాకు ఎలాంటి ఇబ్బందిలేదు’ అని చెప్పారు. అలా ఏం లేదు అని, నేను రీషూట్‌ చేయడం లేదని సమాధానమిచ్చాను. ఇదే విషయాన్ని సోనూ.. కంగనకు ఫోన్‌ చేసి చెప్పారు. దానికి ఆమె.. ‘క్రిష్‌ రీషూట్‌ చేయకపోతే నేను చిత్రీకరిస్తాను’ అని సమాధానమివ్వడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత వాళ్లే రీషూట్‌ చేసుకున్నారు. కాకపోతే నా బాధ ఏమిటంటే.. నేను అనుకున్న, తెరకెక్కించిన కథను ప్రజలకు చూపించలేకపోయాను. ‘మణికర్ణిక’ను నేను 100 శాతం షూట్‌ చేశా. కానీ అందులో వాళ్లు ఎన్నో మార్పులు చేసి ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాన్ని మీకు అందించారు.’’ అని క్రిష్‌ తెలిపారు.

ఇవీ చదవండి

ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్‌ ఇవ్వలేదు: రకుల్‌

విజయ్‌దేవరకొండకు ముద్దుపెడతా: తమన్నామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని