‘యమలీల’కు అలీని తీసుకోవడానికి కారణమదే..! - Krishna Reddy Reveals The Reason Behind Comedian Ali As A Hero In Yamaleela
close
Updated : 24/09/2020 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘యమలీల’కు అలీని తీసుకోవడానికి కారణమదే..!

హైదరాబాద్‌: ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘యమలీల’. 1994లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో హాస్యనటుడు అలీని కథానాయకుడిగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన మాతృమూర్తిని దృష్టిలో ఉంచుకునే ‘యమలీల’ చిత్రంలోని అమ్మపాటను చిత్రీకరించానని కృష్ణారెడ్డి తెలిపారు. ‘యమలీల’ చిత్రంలో నటిస్తామని కొంతమంది అగ్రహీరోలు తనని సంప్రదించారని.. కానీ హీరో విషయంలో తాను ఎంతో స్పష్టతతో అలీని ఎంచుకున్నానని వివరించారు. అంతేకాకుండా తాను హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చానని, అవకాశాల కోసం జంధ్యాల, దాసరి నారాయణరావు లాంటి ఎంతో మంది దర్శకులను కలిశానని, అవకాశాలు రావడం చాలా కష్టమని అర్థమయ్యాక అచ్చిరెడ్డి మాటతో దర్శకత్వంలోకి అడుగుపెట్టానని ఆయన వివరించారు. ఇలా తన జీవితానికి సంబంధించి ఎన్నో సంగతులను ఎస్వీ కృష్ణారెడ్డి సరదాగా పంచుకున్నారు. సెప్టెంబర్‌ 28న ప్రసారం కాబోయే ఆ ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్‌ ప్రోమో మీకోసం..
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని