డేటింగ్‌లో ఉన్నాం.. ఇప్పట్లో పెళ్లికి నో: నటి - Kriti Kharbanda has THIS to say about reports of her impending wedding with Pulkit Samrat
close
Published : 25/11/2020 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డేటింగ్‌లో ఉన్నాం.. ఇప్పట్లో పెళ్లికి నో: నటి

వరుస కథనాలపై స్పందించిన కృతి కర్బంధ

ముంబయి: బాలీవుడ్‌ నటుడు పుల్‌కిత్‌ సామ్రాట్‌తో నటి కృతికర్బంద కొన్ని నెలల నుంచి రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరగనుందంటూ వరుస కథనాలు ప్రచూరితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై నటి కృతి స్పందించారు. ఇప్పట్లో వివాహబంధంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన తమకి లేదని ఆమె అన్నారు.

‘పుల్‌కిత్‌ చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగత ప్రేమకు అతను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాడు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసి స్నేహితులమయ్యాం. అనంతరం రిలేషన్‌లోకి అడుగుపెట్టాం. ఏడాదిన్నర నుంచి డేటింగ్‌లో ఉన్నాం. మా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. అతి త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టాలని మేము అనుకోవడం లేదు. ప్రస్తుతానికి మా దృష్టంతా కెరీర్‌పైనే ఉంది.’ అని కృతి తెలిపారు.

తెలుగులో తెరకెక్కిన ‘బోణి’ చిత్రంతో కృతి కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె ‘తీన్‌మార్‌’, ‘మిస్టర్‌ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’ చిత్రాల్లో నటించారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘బ్రూస్‌ లీ’ సినిమాలో ఆమె చివరిసారిగా తెలుగు తెరపై కనిపించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని