‘దిల్‌ బేచారా’ చూసి కృతిసనన్‌ భావోద్వేగ పోస్ట్‌ - Kriti Sanon Emotional Post on Sushant Singh Rajput Dil Bechara
close
Published : 27/07/2020 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దిల్‌ బేచారా’ చూసి కృతిసనన్‌ భావోద్వేగ పోస్ట్‌

ముంబయి: సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ చివరి సారిగా నటించిన చిత్రం ‘దిల్‌ బేచారా’. సంజనా సంఘీ కథానాయిక. ముఖేశ్‌ చబ్రా దర్శకుడు. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా సుశాంత్‌ నటన చూసి అతడు ఈ లోకంలో లేడన్న విషయం గుర్తొచ్చి అభిమానులందరూ భావోద్వేగానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో నటి కృతి సనన్‌ ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేసింది. గతంలో వీరిద్దరూ ‘రాబ్తా’లో కలిసి నటించారు. ‘‘దీన్ని జీర్ణించుకోలేకపోతున్నా. స్క్రీన్‌పై మ్యానీ(దిల్‌ బేచారాలో సుశాంత్‌ పేరు)ని చూసి పదే పదే నా హృదయం బద్దలైపోతోంది. ఎన్నో సందర్భాల్లో నువ్వు నిజంగా జీవించి వచ్చావనిపించింది. నీ అసలైన వ్యక్తిత్వాన్ని ఆ పాత్రలో పెట్టి నటించావు. నువ్వు నిశబ్ధంగా ఉన్న సన్నివేశాలన్నీ మేజిక్‌లా అనిపించింది’’ అని రాసుకొచ్చింది.

ఈ సందర్భంగా దర్శకుడు ముఖేశ్‌ చబ్రా, కథానాయిక సంజనా సంఘీలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ముఖేశ్‌ ఈ సినిమా మీకు ఎంతో ముఖ్యమన్న విషయం తెలుసు. తొలి చిత్రంతోనే భావోద్వేగాలకు గురి చేశారు. సంజనా మీ కెరీర్‌ అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని కృతి చెప్పుకొచ్చింది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని