అబ్బాయిలకు కొంచెం సంస్కారం నేర్పించకూడదా..? - Kriti Sanon Swara Bhasker slam BJP MLA who said rapes can be stopped if daughters are taught good Values
close
Published : 06/10/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అబ్బాయిలకు కొంచెం సంస్కారం నేర్పించకూడదా..?

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నటి కృతిసనన్‌ ఫైర్‌..!

ముంబయి: హాథ్రస్‌ హత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ యూపీకి చెందిన ఓ భాజపా ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాథ్రస్‌ ఘటనపై భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ స్పందిస్తూ.. ‘మంచి విలువలు, సంస్కారంతోనే సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయవచ్చు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సంస్కారం, గొప్ప విలువలు నేర్పించాలి. ప్రభుత్వాలు ఆడపిల్లలకు రక్షణ మాత్రమే ఇస్తాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నటి కృతిసనన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఆయన ఏం చెప్పారో ఆయనకైనా తెలుస్తోందా? ముందు ఇలాంటి మనస్తత్వాలు మారాలి..! ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అసలు తల్లిదండ్రులు తమ అబ్బాయిలకు కొంచెం సంస్కారం ఎందుకు నేర్పించకూడదు?’ అని కృతిసనన్‌ అన్నారు. కాగా, మరో నటి స్వరాభాస్కర్‌ సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తి ఒక  పాపి అంటూ ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని