సుశాంత్‌తో కృతిసనన్‌ డేటింగ్..! - Kriti Sanon dated Sushant Singh Rajput claims Lizaa Malik
close
Published : 19/09/2020 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌తో కృతిసనన్‌ డేటింగ్..!

బర్త్‌డే పార్టీలో చూశానన్న నటి లిజామాలిక్‌

ముంబయి: యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌తో కృతిసనన్‌ ఒకానొక సమయంలో డేటింగ్‌లో ఉన్నారని నటి లిజా మాలిక్‌ వెల్లడించారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్‌ వ్యక్తిగత జీవితం గురించి బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను సహనటీనటులు, స్నేహితులు, సన్నిహితులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ స్నేహితురాలు, ఆప్తురాలైన నటి లిజా మాలిక్‌ ఆయనకి సంబంధించిన కొన్ని కొత్త విషయాలను ఓ ఆంగ్లపత్రికతో పంచుకున్నారు.

‘దాదాపు రెండేళ్ల క్రితం కృతిసనన్‌ బర్త్‌డే పార్టీలో చివరిసారిగా సుశాంత్‌ సింగ్‌ని కలిశాను. బంద్రా క్లబ్‌లో జరిగిన ఈ పార్టీలో సుశాంత్‌ ఎంతో సంతోషంగా కనిపించాడు. పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కర్నీ నవ్వుతూ పలకరించాడు. వ్యక్తిగత జీవితంలో ఆయన ఎప్పుడూ సరదాగానే ఉండేవాడు. జోక్స్‌ వేసి అందర్నీ నవ్విస్తూ చాలా ఆత్మీయంగా మాట్లాడేవాడు.’

‘సాధారణంగా.. ఏదైనా విందు, పార్టీకి వెళ్లినప్పుడు.. ఎవరైతే ఆ పార్టీని ఏర్పాటు చేస్తారో వాళ్లు మాత్రమే వచ్చిన అతిథులకు మర్యాదలు చేస్తారు. పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తితోపాటు.. మరోవ్యక్తి కూడా అక్కడ హడావుడి చేస్తున్నారంటే.. వాళ్లిద్దరి మధ్య ఎవరికీ తెలియని అనుబంధం ఉందని అర్థం. అలాగే కృతిసనన్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లినప్పుడు ఆమెతోపాటు సుశాంత్‌ సింగ్‌ కూడా వచ్చిన అతిథులకు సకల మర్యాదలు చేయడం మాత్రమే కాకుండా అందరితో మాట్లాడుతూ.. డ్రింక్స్‌ అందిస్తూ.. డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఆరోజు సుశాంత్‌-కృతి సనన్‌ ముఖాల్లో ఎంతో సంతోషం కనిపించింది. వాళ్లిద్దరూ అంత ఆనందంగా ఉండడం చూస్తే రిలేషన్‌లో ఉన్నారని నాకు అనిపించింది. మరొక విషయం ఏమిటంటే.. సుశాంత్‌-కృతి రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఎన్నో సందర్భాల్లో వాళ్లిద్దరూ కలిసి బయటకు వస్తూనే ఉన్నారు.’ అని లిజా తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని