ప్రభాస్‌తో మహేశ్‌ హీరోయిన్‌! - Kriti Sanon in consideration to play the leading role opposite Prabhas
close
Published : 17/10/2020 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌తో మహేశ్‌ హీరోయిన్‌!

హైదరాబాద్‌: మహేశ్‌ చిత్రంలో ఆడిపాడిన ఓ బాలీవుడ్‌ భామ ఇప్పుడు ప్రభాస్‌ చిత్రంలో చోటు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆది పురుష్‌’. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అయితే సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. అనుష్క శెట్టి, కీర్తిసురేశ్‌తోపాటు భాలీవుడ్‌ భామలు అనుష్క శర్మ, ఊర్శశి రౌతెలా, కియారా అడ్వాణీ పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సదరు వార్తలకు కొంతమేర చెక్‌ పడింది.

కాగా, బాలీవుడ్‌ భామ కృతిసనన్‌ ‘ఆది పురుష్‌’ చిత్రంలో సీత పాత్ర పోషించనున్నారంటూ తాజాగా నెట్టింట్లో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం సదరు హీరోయిన్‌ను కలిసినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారని చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సదరు వార్తలపై ‘ఆది పురుష్‌’ టీమ్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో కృతిసనన్‌ కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. అనంతరం ఆమె వరుస బాలీవుడ్‌ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం  ‘మిమీ’ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని