కృతిసనన్‌కు కరోనా పాజిటివ్‌ - Kriti Sanon tests positive for Covid19
close
Published : 07/12/2020 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృతిసనన్‌కు కరోనా పాజిటివ్‌

ముంబయి: బాలీవుడ్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. హీరోయిన్‌ కృతిసనన్‌కు కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం రాజ్‌కుమార్‌రావ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న కృతి.. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకొని చండీగఢ్‌ నుంచి దిల్లీకి తిరుగుపయనమైంది. ఈ సందర్భంగా విమానంలో ఓ ఫొటో దిగి అభిమానులతో పంచుకుందామె. షూటింగ్‌ పూర్తయిందని కూడా అందులో పేర్కొంది. అయితే.. ఆ పోస్టు తర్వాత ఆమె మళ్లీ సోషల్‌ మీడియాలో కనిపించలేదు. తాజాగా ఆమె కరోనా బారిన పడినట్లు తెలిసింది.
వరుణ్‌ ధావన్‌తో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు నీతూ కపూర్‌, మనీశ్‌పాల్‌ కూడా కరోనా బారినపడ్డారు. ‘జగ్‌.. జగ్‌.. జీయో’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో వాళ్లకు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. అయితే.. ఇదే సినిమాలో కియారా అడ్వాణీ, అనిల్‌ కపూర్‌ కూడా నటిస్తున్నారు. వాళ్లకు మాత్రం కరోనా నెగెటివ్‌ వచ్చింది. 
కృతిసనన్‌.. తెలుగులో మహేశ్ సరసన ‘1 నేనొక్కడినే’లో ‘సమీరా’గా కనిపించింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి ‘దోచెయ్‌’లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైంది. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వస్తున్న ‘ఆదిపురుష్‌’లో సీతగా కృతి కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి...
అబ్బాయిలకు కొంచెం సంస్కారం నేర్పించకూడదా..?

‘దిల్‌ బేచారా’ చూసి కృతిసనన్‌ భావోద్వేగ పోస్ట్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని