ప్రథమార్ధంలో రాణించిన ఎల్‌ఐసీ - LIC excelled in the first half
close
Updated : 09/10/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రథమార్ధంలో రాణించిన ఎల్‌ఐసీ

తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.25,000 కోట్లు

హైదరాబాద్‌: కరోనా సమయంలోనూ ఎల్‌ఐసీ రాణించింది. ఇటీవలే ముగిసిన 2020-21 తొలి అర్థభాగంలో తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.25,000 కోట్లుగా నమోదైంది. సెప్టెంబరు 30, 2019న ఈ ఆదాయం రూ.24,867.70 కోట్లుగా ఉంది. జీవన్‌శాంతి ప్లాన్‌ కింద ఎల్‌ఐసీ తొలి ఏడాది ప్రీమియం కింద రూ.11,456.41 కోట్లను వసూలు చేసింది. యులిప్‌ వ్యాపారం కూడా రాణించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్‌ఐసీ పెన్షన్‌ అండ్‌ గ్రూప్‌ స్కీమ్స్‌ విభాగం రూ.62,112.27 కోట్లు వసూలు చేసింది. పాలసీల సంఖ్య, తొలి ఏడాది ప్రీమియం విషయంలో రెండో త్రైమాసికంలో ఎల్‌ఐసీ సమ్మిళిత మార్కెట్‌ వాటా 67.82 శాతం; 70.57 శాతంగా నిలిచింది. కాగా, 2019-20 ఏడాదికి రూ.51,000 కోట్లను బోనస్‌గా ప్రకటించింది. ప్రస్తుత ధోరణుల మధ్య 2020-21 పూర్తి ఏడాదిలోనూ మెరుగ్గా రాణించవచ్చని ఎల్‌ఐసీ అంచనా వేస్తోంది.

 

 

 


 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని