‘లక్ష్మీబాంబ్‌’ టైటిల్‌ మారింది! - Laxmmi Bomb title changed to Laxmmi Premieres on Nov 9
close
Published : 29/10/2020 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లక్ష్మీబాంబ్‌’ టైటిల్‌ మారింది!

ముంబయి: సినిమా టైటిల్స్‌పై వివాదాలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ విడుదలకు ముందు అనేక చిత్రాల టైటిల్స్‌ను మార్చిన సంఘటనలు ఎన్నో. తాజాగా ఆ జాబితాలో అక్షయ్‌కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్‌’ చేరింది. చిత్ర బృందానికి శ్రీ రాజ్‌పూత్‌ కర్ణిసేన లీగల్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు, పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సినిమా పేరును మార్చారు. ‘లక్ష్మి’ పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘లక్ష్మీ బాంబ్‌’ టైటిల్‌ మత విశ్వాసాలు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా, లక్ష్మీదేవిని అగౌరవపరిచేలా ఉందని కాబట్టి వెంటనే దాన్ని మార్చాలని కర్ణిసేన కోరింది.

‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా ‘లక్ష్మీ’గా తెరకెక్కింది. రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్‌ సరసన కియారా అడ్వాణీ కనిపించనున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా నవంబర్‌ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘లక్ష్మీ’ ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అక్షయ్‌ నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని