కార్గిల్‌ విజయం భారత్‌కు గర్వకారణం - Leaders pays tributes to Indian soldiers who lost theier lives inKargil war
close
Updated : 26/07/2020 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్గిల్‌ విజయం భారత్‌కు గర్వకారణం

అమర జవాన్లకు ప్రముఖుల నివాళి

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. 1999 జులై 26న భారత సైన్యం కార్గిల్‌లో శతృ దేశం పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. అది జరిగి నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఏటా ఈ రోజును కార్గిల్‌ విజయ్‌ దివస్‌గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత సైన్య ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్లు చేశారు. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. 

* దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు వందనాలు. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారత సైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నా. అత్యంత కఠిన పరిస్థితుల్లో శత్రువులను మట్టికరిపించిన ఘటనను యావత్‌ ప్రపంచం కొనియాడింది.  -రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణశాఖ మంత్రి

* ఈ విజయం భారత దేశానికి గర్వకారణం. కార్గిల్‌లో ఎంతో ధైర్యంగా పోరాడి పాక్‌ను చిత్తు చేసి, మళ్లీ అక్కడ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాతృభూమి సంరక్షణ కోసం కట్టుబడి ఉన్న హీరోలను చూసి దేశం గర్విస్తోంది - కేంద్ర హోం‌ మంత్రి అమిత్‌ షా

* ఎంతో ధైర్య సాహసాలతో దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న నిజమైన హీరోలకు సెల్యూట్‌ చేస్తున్నా.. జైహింద్‌.- కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని