లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ రీయూనియన్‌ - Life Is Beautiful Reunion Photos Viral On Insta
close
Published : 28/12/2020 11:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ రీయూనియన్‌

నెట్టింట్లో ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబకథా చిత్రం ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’తో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు అభిజిత్‌. అమ్మ ప్రేమ, స్నేహం గొప్పతనం వంటి అంశాలను చక్కగా చూపించిన ఈ సినిమాలో ‘టాలీవుడ్‌ రౌడీ’ విజయ్‌దేవరకొండ ఓ చిన్న పాత్రలో నటించారు. 2012లో విడుదలైన ఈ సినిమా యువతను బాగా ఆకర్షించింది.

దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నటులందరూ తాజాగా విజయ్‌ దేవరకొండ ఇంట్లో కలిశారు. సుధాకర్‌, అభిజిత్‌తోపాటు ఆ సినిమాలో నటించిన పలువురు విజయ్‌ ఇంటికి వచ్చి సరదాగా గడిపారు. అనంతరం విజయ్‌ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ రీ యూనియన్‌’ అని పేర్కొంటూ కొన్ని ఫొటోలను సుధాకర్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ  ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

తన తదుపరి చిత్రం కోసం విజయ్‌ ప్రస్తుతం సన్నద్ధమవుతున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. అనన్యపాండే కథానాయిక.

ఇదీ చదవండి

విజయ్‌ దేవరకొండ నా వాడు: అభిజిత్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని