బ్రిటన్‌లో మళ్లీ విజృంభణ..పలుచోట్ల లాక్‌డౌన్‌! - Lock down restrictions imposed in Northern England
close
Published : 31/07/2020 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రిటన్‌లో మళ్లీ విజృంభణ..పలుచోట్ల లాక్‌డౌన్‌!

లండన్‌: కరోనావైరస్‌ మహమ్మారి ధాటికి బ్రిటన్‌ వణికిపోయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో యూకేలో ఆంక్షలు సడలించారు. అనంతరం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పటుచోట్ల వైరస్‌ తీవత్ర ఎక్కువ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించింది. తాజా పరిణామాలతో రెండో దఫా వైరస్‌ విజృంభణ మొదలైందా?అనే ఆందోళన బ్రిటన్‌ వాసుల్లో నెలకొంది.

బ్రిటన్‌లో ఇప్పటికే అక్కడ 3లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 46వేల మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్‌ మరణాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో బ్రిటన్ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్లు అధికారులు భావించారు. కానీ, మాంచెస్టర్‌ ప్రాంతంలో వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. నెలరోజుల అనంతరం ఒక్కరోజే భారీ సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం దాదాపు 40లక్షల జనాభా కలిగిన మాంచెస్టర్‌ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. నగరంలో ప్రజలు ఇతర కుటుంబాలతో కలవకూడదని ఆదేశించింది. ఉత్తర యార్క్‌షైర్‌, తూర్పు లాంకషైర్‌ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో వైరస్‌ ప్రభావం అధికంగా ఉందని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ కార్యదర్శి హాట్‌ హ్యాంకాక్‌ అక్కడి మీడియాతో అన్నారు. ప్రస్తుతం రెండో దఫా విజృంభణ ఆరంభం కాలేదని స్పష్టం చేసిన ఆయన, ఒకవేళ వస్తే మాత్రం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో ప్రజలు సమూహాలుగా ఏర్పడవద్దని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రెస్టారెంట్లలో ప్రజలు గుమిగూడ వద్దని ఆదేశించారు.

ఇదిలా ఉంటే, దేశంలో కరోనావైరస్‌ తీవ్రత అధికంగా ఉందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమయంలో బ్రిటన్‌ వాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని