జగన్‌ ఒక్కఛాన్స్‌ అడిగింది అందుకేనా?: లోకేశ్‌ - Lokesh Fires On Cm Jagan
close
Published : 19/08/2020 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ ఒక్కఛాన్స్‌ అడిగింది అందుకేనా?: లోకేశ్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్క ఛాన్స్‌ అడిగింది ప్రజల కోసం కాదని.. రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఒక పక్క కరోనా.. మరోపక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో సీఎం బిజీగా ఉన్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు. కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్లీ అరెస్టు చేశారని లోకేశ్‌ మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా సోకడానికి ముఖ్యమంత్రి జగన్‌ నేర మనస్తత్వమే కారణమని విమర్శించారు. కడప జైలులో 317 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్న ఆయన.. తక్షణమే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్‌ చెప్పారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని