షూటింగ్‌ ముగిసింది.. విడుదల ఎప్పుడో? - LoveStory completes shoot and getting ready for release
close
Published : 18/11/2020 22:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షూటింగ్‌ ముగిసింది.. విడుదల ఎప్పుడో?

హైదరాబాద్‌: తనదైన శైలిలో ప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను మాయచేయడంతో దిట్ట డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడటమే మిగిలిందంటూ ఆ చిత్ర బృందం అభిమానులకు శుభవార్త ప్రకటించింది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరోయిన్‌ సాయిపల్లవి, కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌తో పాటు సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కలిసి ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ‘‘లవ్‌స్టోరీ’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధమవుతోంది. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని తెలిపింది.
శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు పవన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లాక్‌డౌన్‌కు ముందు సగం.. లాక్‌డౌన్‌ తర్వాత మిగతా సగం పూర్తి చేసుకుంది. అయితే.. ఈ చిత్రాన్ని ఏ మాధ్యమంలో విడుదల చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్లు ఇంకా తెరచుకోని నేపథ్యంలో ఓటీటీలో విడుదలవుతుందా..? లేక కొంతకాలం వేచి చూసి థియేటర్లలోనే విడుదల చేస్తారా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. కాగా.. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగానే.. హీరో నాగచైతన్య ఇప్పటికే తన షూట్‌ పూర్తి చేసుకొని తర్వాతి సినిమాకు డెట్స్‌ ఫిక్స్‌ చేశాడు. మరోవైపు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల సైతం ఈసారి లవ్‌స్టోరీ పక్కనపెట్టి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. సాయి పల్లవి కూడా వరుస ఆఫర్లతో బిజీ షెడ్యూల్‌ వేసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని