‘అమ్మాయిల్ని చూసేందుకు కాలేజీకొచ్చావా?’ - Maa Vintha Gaadha Vinuma Teaser released by nani
close
Updated : 30/10/2020 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అమ్మాయిల్ని చూసేందుకు కాలేజీకొచ్చావా?’

‘మా వింత గాధ వినుమా’ టీజర్

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటులు సిద్ధు, సీరత్‌ కపూర్‌ జంటగా నటించిన సినిమా ‘మా వింత గాధ వినుమా’ టీజర్‌ను ప్రముఖ నటుడు నాని విడుదల చేశారు. ఎమ్‌. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ప్రగతి, మంచు లక్ష్మి, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాలేజీ ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. సిద్ధు తన ప్రేయసి సీరత్‌ కోసం తపన పడుతూ కనిపించారు. ‘నువ్వు కాలేజీకి ఎందుకొచ్చావు?, అమ్మాయిల్ని చూడటానికా?, నీకు ప్రేమ కావాలా?..’ అని కాలేజీ లెక్చరర్‌ సిద్ధును ప్రశ్నిస్తే.. ఆయన మౌనంగా ఉండిపోయారు. నవంబరు 13న ఆహా వేదికగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని