దేవుడు మమ్మల్ని మరోసారి ఎంచుకున్నాడు - Maanayata Warns Against Rumours
close
Published : 12/08/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవుడు మమ్మల్ని మరోసారి ఎంచుకున్నాడు

సంజయ్‌ దత్ భార్య మాన్యతాదత్‌

ముంబయి: బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వార్తలు వస్తోన్న తరుణంలో బుధవారం ఆయన భార్య మాన్యతాదత్‌ స్పందించారు. ఈ విషయంపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయొద్దని కోరారు. అలాగే తన భర్త త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

‘సంజూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోన్నవారికి కృతజ్ఞతలు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మాకు మీ అందరి ప్రార్థనలు అవసరం. గతంలో మాదిరిగానే ఈసారి దీన్ని దాటుకొని రాగలమన్న విశ్వాసం ఉంది. అనవసరమైన పుకార్ల కారణంగా ఆందోళనకు గురికావద్దని, మీ ప్రేమతో మాకు సహకరించమని సంజు అభిమానులను కోరుతున్నాను. పరీక్షించడానికి దేవుడు మరోసారి మమ్మల్ని ఎంచుకున్నాడు. ఎప్పటిలాగే మరోసారి విజేతలుగా నిలుస్తామని తెలుసు. ఈ అవకాశాన్ని ఆశావాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగిద్దాం’ అంటూ మాన్యత ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఒక్కసారిగా శ్వాసలో ఇబ్బంది తలెత్తడంతో ఆగస్టు 8న సంజయ్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం రెండు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు. అనంతరం వైద్యం నిమిత్తం తాను సినిమాల నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నట్లు మంగళవారం ట్వీట్ చేసి ఆశ్చర్యపర్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని