
తాజా వార్తలు
సుమ ప్రశ్నకు మహేశ్ సరదా సమాధానం
హైదరాబాద్: సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఎంటర్టైన్మెంట్ గేమ్ షో ‘క్యాష్ దొరికినంత దోచుకో’లో తాజాగా మహేశ్, వైవా హర్ష, జోష్ రవి, సుదర్శన్ పాల్గొని సందడి చేశారు. షోలో భాగంగా హర్ష, మహేశ్, సుమ వేసిన పంచులు ఆకట్టుకున్నాయి.
‘కొబ్బరితోటలో కలెక్షన్‌కింగ్’ అనే రౌండ్లో సుమ-హర్షల మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు పూయించాయి. కొబ్బరితోట గురించి గోదావరి మాండలికంలో సుమ మాట్లాడిన విధానం ఆకట్టుకుంది. ‘సుమ బాస్కెట్‌బాల్ లీగ్’లో భాగంగా.. ‘ఈ రెండింటిలో ఇది చేసి నేను చాలా తప్పు చేశాను అని ఎప్పుడు అనుకున్నావు? 1.నటుడు అయినప్పుడు 2. పెళ్లి చేసుకున్నప్పుడు’ అని సుమ ప్రశ్నించడంతో.. ‘పెళ్లి’ అని మహేశ్ సరదా సమాధానం ఆకట్టుకుంది. ఈ జోష్‌ఫుల్ ఎపిసోడ్‌ని చూడాలంటే వచ్చే శనివారం వరకూ వేచి చూడాల్సిందే. డిసెంబర్ 5న ప్రసారం కానున్న ‘క్యాష్’ ప్రోమో చూసేయండి..!