సూపర్‌స్టార్‌ ట్వీట్‌.. ఫ్యాన్స్‌ ఫిదా..! - MaheshBabu Tweet On Khaleja 10 Years
close
Published : 07/10/2020 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూపర్‌స్టార్‌ ట్వీట్‌.. ఫ్యాన్స్‌ ఫిదా..!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తాజాగా పెట్టిన ఓ ట్వీట్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ‘ఖలేజా’. మహేశ్‌లోని హీరోయిజంతోపాటు కామెడీ టైమింగ్‌ను ప్రేక్షకులకు చేరువ చేసిన ఈ సినిమా విడుదలై బుధవారంతో 10 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో  మహేశ్‌ సోషల్‌మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు‌. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా కోసం తాను వేచి చూస్తున్నట్లు వెల్లడించారు.

‘‘ఖలేజా’ చిత్రం విడుదలై పదేళ్లు అవుతోంది. ఒక నటుడిగా నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకున్న చిత్రం. నా కెరీర్‌లో ఎప్పటికీ ఇది ప్రత్యేకమైన సినిమా. నాకు మంచి స్నేహితుడైన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. మన తదుపరి చిత్రం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. మహేశ్‌ పెట్టిన ట్వీట్‌తో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ‘సూపర్‌ కాంబినేషన్‌ వచ్చేస్తోంది’, ‘మహేశ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది..’, ‘మహేశ్‌-త్రివిక్రమ్‌ మరొక్కసారి వెండితెరపై సందడి చేయనున్నారు.’ అని కామెంట్లు పెడుతున్నారు. ‘ఖలేజా’ కంటే ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత మహేశ్‌ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయిక. అలాగే మహేశ్‌-రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. మరోవైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సైతం.. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని