బౌలింగ్‌ యంత్రం సాయంతో మహీ సాధన! - Mahi practicing with bowling machine
close
Published : 08/08/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బౌలింగ్‌ యంత్రం సాయంతో మహీ సాధన!

ఇంటర్నెట్‌డెస్క్‌‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ తనదైన వ్యూహంతో సాధన చేస్తున్నాడని సమాచారం. ఝార్ఖండ్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన రాంచీ మైదానంలో అతడు విపరీతంగా శ్రమిస్తున్నాడు. గత వారంతంలో బౌలింగ్‌ యంత్రం సాయంతో బ్యాటింగ్‌ సాధన చేశాడని తెలిసింది. రాష్ట్ర క్రికెట్ ‌సంఘం సభ్యుడొకరు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

‘గతవారం ధోనీ జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్‌ను సందర్శించాడు. ఇండోర్‌లో బౌలింగ్‌ యంత్రం సాయంతో సాధన చేశాడు’ అని ఆ అధికారి తెలిపారు. అయితే మహీ రెండు రోజులు మాత్రమే బ్యాటింగ్‌ చేశాడని అతడి ప్రణాళికలేమిటో తెలియదని ఆయన పేర్కొన్నారు. ‘వారాంతంలో రెండు రోజులు ధోనీ ప్రాక్టీస్‌ చేశాడు. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అతడి ప్రణాళికలు ఏమిటో నిజంగా మాకు తెలియదు. మళ్లీ సాధన చేసేందుకు వస్తాడో లేదో తెలియదు’ అని ఆయన చెప్పారు.

మార్చిలో చెన్నైలో సాధన చేసిన మహీ లీగ్‌ వాయిదా పడటంతో మళ్లీ కనిపించలేదు. ఐపీఎల్‌-2020 సెప్టెంబర్‌19 నుంచి నవంబర్‌ 10 జరుగుతుందని బీసీసీఐ ప్రకటించడంతో అతడు మళ్లీ బ్యాటు పట్టాడు. సాధన చేస్తున్నాడు. ఆగస్టు 20న చెన్నై బృందమంతా ఛార్టెడ్‌ విమానంలో దుబాయ్‌కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఐదు నక్షత్రాల హోటల్లో రెండు ఫ్లోర్లలో ఆటగాళ్లు, సిబ్బంది ఉంటారని తెలిసింది. కఠినమైన నిబంధనలు, భద్రత పరమైన ఇబ్బందుల రీత్యా కుటుంబ సభ్యులను తీసుకెళ్లడం లేదని సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని