ఆనందం ఎక్కడ దొరుకుతుందో చెప్పిన మహీంద్రా - Mahindra Shares Life Lesson Drawing That Goes Viral
close
Published : 12/11/2020 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆనందం ఎక్కడ దొరుకుతుందో చెప్పిన మహీంద్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆనందం ఎక్కడ దొరుకుతుంది..? ఈ ప్రశ్న ఒక్కటే కానీ దానికి సమాధానాలే రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన ఆనందం. కొందరు కూనిరాగం తీస్తూ తమలో తాము లీనమై ఆనందాన్ని పొందితే..మరొకరు ఇతరులను ఆదుకోవడంలో ఆనందాన్ని పొందుతారు..ఇంకొకరు జీవితంలో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిచడం ద్వారా ఆనందాన్ని పొందామంటారు. అయితే దీన్ని ఎవరికి వారే తమ సొంతంగా పెంపొందించుకోవాల్సిందే కానీ ఇతరుల నుంచి బహుమతిగానో లేదా ఇంకోరకంగానో పొందలేమనేది జీవిత సత్యం. దీనిని తెలియజేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా గురువారం ఒక ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే మహీంద్రా లాంటి వ్యక్తి జీవిత పాఠానికి సంబంధించి షేర్‌ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఆయన షేర్‌ చేసిన పోస్ట్‌లో ఒక డ్రాయింగ్ ఉంది. అందులో ఒక వ్యక్తి హ్యాపినెస్‌ అని రాసి ఉన్న బోర్డు పట్టుకుని ఉంటాడు. మరో వ్యక్తి అతణ్ని ‘‘అది నీకు ఎక్కడ దొరికింది. దాని కోసం నేను చాలా చోట్ల వెతుకున్నాను అని అడుతాడు. దానికి ఆ వ్యక్తి దీన్ని నాకు నేనుగా పొందాను అని సమాధామిస్తాడు.’’ ఈ డ్రాయింగ్‌ని మహీంద్రా షేర్ చేస్తూ ‘‘ఒక ఫొటో వెయ్యి పదాలకు సమానం అని చాలా మంది చెప్తుంటారు. అది నిజమే.. కొన్నిసార్లు సాధారణ డ్రాయింగ్ కూడా వెయ్యి ఫొటోలకు సమానమనిసిస్తుంది ’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘అవును..ఆనందం ఒకరు ఇచ్చేది కాదు..మనకి మనమే సొంతంగా పొందాలి’, ‘ఆనందంగా ఉండటం ఎంతో సింపుల్..కానీ చాలా మంది సింపుల్‌గా ఉండటం కష్టంగా భావిస్తారు అని ట్వీట్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని