‘మేజర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది - Major First Look Out Now
close
Updated : 17/12/2020 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మేజర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

హైదరాబాద్: 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం అడివి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మేజర్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘అడివి శేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘మేజర్‌’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘మేజర్‌’ చిత్రంలో నీ నటన ఉత్తమంగా ఉంటుంది. నీకంతా సంతోషం, అదృష్టం చేకూరాలని ఆశిస్తున్నా’ అని మహేశ్‌బాబు అన్నారు. పాన్‌ ఇండియన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి అడివిశేష్‌ కథ అందించారు. సోనీ ఫిల్మ్స్‌ ఇండియా, జీ మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా ‘మేజర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇవీ చదవండి

అందుకే ఆ పాత్రలు చేయలేదు..

మహేశ్‌ ఫొటోలు జూమ్‌ చేసి చూసేదాన్నిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని