మాల్‌లో వేధింపులు ఎదుర్కొన్న ప్రముఖ నటి - Malayalam actress molested in a mall says being a woman is tiring
close
Updated : 18/12/2020 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాల్‌లో వేధింపులు ఎదుర్కొన్న ప్రముఖ నటి

ఆవేదనతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌

తిరువనంతపురం: మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి తాజాగా ఓ మాల్‌లో అందరూ చూస్తుండగా వేధింపులను ఎదుర్కొన్నారు. తాను మాల్‌లో షాపింగ్‌ చేస్తుండగా.. ఇద్దరు యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపణలు చేస్తూ తాజాగా సదరు నటి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ సందేశం పెట్టారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమంది పురుషులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడి మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆమె అన్నారు.

‘నగరంలోనే పేరుపొందిన, ఎప్పుడూ రద్దీగా ఉండే ఓ షాపింగ్‌మాల్‌కు తాజాగా నా కుటుంబంతో కలిసి వెళ్లాను. అక్కడ ఇద్దరు అబ్బాయిలు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. అభ్యంతరకరంగా వెనుక నుంచి నన్ను తాకారు. ఆ క్షణం నాకు ఏం అర్థం కాలేదు. పొరపాటున వాళ్ల చేతులు నాకు తగిలాయని అనుకున్నాను. కానీ, ఏదో తెలియని భయం, కోపం. ఇదంతా చూసిన నా సోదరి.. వాళ్లు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నారని నాతో చెప్పింది. దీంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం నా సోదరితో కలిసి అదే మాల్‌లో ఓ షాప్‌లో కొన్ని వస్తువులు కొనేందుకు వెళ్లాను. అక్కడే మా అమ్మ, సోదరుడు ఉన్నారు. అనంతరం బిల్‌ కట్టేందుకు లైన్‌లో నేను, నా సోదరి నిల్చున్న సమయంలో మరోసారి ఆ ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. నాతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇదంతా గమనించిన మా అమ్మ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో వాళ్లు పారిపోయారు. కొంతమంది పురుషులు తమ మానసిక ఆరోగ్యం బాగోక ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. నాకు జరిగిన విధంగా మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నాను’ అని నటి పేర్కొన్నారు. నటి పెట్టిన పోస్ట్‌ని సుమోటోగా తీసుకుని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది.

ఇవీ చదవండి
కేఫ్‌లో పనిచేసి.. యాంకర్‌ టు యాక్టర్‌

దిల్‌రాజు బర్త్‌డే పార్టీలో స్టార్ హీరోల సందడి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని