‘ఢీ’ కంటే బెటర్‌ ఏముంది: మంచు విష్ణు - Manchu Vishnu Tweet About Dhee Movie
close
Published : 20/11/2020 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఢీ’ కంటే బెటర్‌ ఏముంది: మంచు విష్ణు

హైదరాబాద్‌: ‘ఢీ’.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరి నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్‌ కామెడీ టైమింగ్‌ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే త్వరలో ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌ రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచువిష్ణు చేసిన ఓ ట్వీట్‌తో ‘ఢీ’ సీక్వెల్‌ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

‘‘కొన్ని వేలమంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటీనటుడికి ఇది ఒక గేమ్‌ఛేంజర్‌. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన ఓ సరికొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది. ‘ఢీ’ కంటే బెటర్‌ ఏమి ఉంటుంది?’’ అని విష్ణు పేర్కొన్నారు. అంతేకాకుండా నవంబర్‌ 23న ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వివరించారు. దీంతో నెటిజన్లు ‘ఢీ’ సీక్వెల్‌ గురించే విష్ణు ప్రకటించనున్నారని చెప్పుకొంటున్నారు.

ప్రస్తుతం ‘మోసగాళ్లు’ చిత్రంలో మంచువిష్ణు నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌, సునీల్‌శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని