మెగాస్టార్‌ను కలిసిన విష్ణు.. కారణమేంటో..? - Manchu vishnu met up with Bigboss
close
Published : 23/12/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాస్టార్‌ను కలిసిన విష్ణు.. కారణమేంటో..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ కథానాయకుడు మంచు విష్ణు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ఆ ఫొటోను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ రోజు బిగ్‌బాస్‌ను కలిశాను. ఎందుకు కలిశాననేది త్వరలో వెల్లడిస్తాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, చిరును ఎందుకు కలిశారన్న విషయం చెప్పకపోగా.. కారణం త్వరలోనే వెల్లడిస్తానని చెప్పడంతో సినీవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే.. ప్రస్తుతం మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్‌లో చిరును ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే చిరును విష్ణు కలిశారంటూ కొన్ని వార్తలు వస్తుండగా.. లేదులేదు.. చిరు సినిమా ‘లూసిఫర్‌’లో మంచు విష్ణు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. మరి.. వీళ్లిద్దరి కలయికకు కారణమేంటో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’లో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. సునీల్‌శెట్టి, రుహి సింగ్‌, నవీన్‌చంద్ర, నవదీప్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీంత అందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మోహన్‌ రాజ్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ చేయనున్నారు.

ఇదీ చదవండి..

‘షకీలా’ న్యూ సాంగ్‌ చూశారా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని