ఆమె నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి: బన్నీ - Many happy returns of the day to the most special person in my life posted allu arjun
close
Published : 29/09/2020 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి: బన్నీ

స్నేహారెడ్డి బర్త్‌డే పార్టీ.. ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ పార్టీలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే పాల్గొన్నారు. బన్నీ తన జీవిత భాగస్వామిని విష్‌ చేశారు. ‘నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలి. మరెన్నో పుట్టినరోజు వేడుకలకు నేను ఇలానే నీ పక్కనుండాలని కోరుకుంటున్నా. జన్మదిన శుభాకాంక్షలు క్యూటీ..’ అని బన్నీ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు భార్య కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. స్నేహ గులాబి రంగు ట్యూబ్‌ ఫ్లోరల్‌ ప్రింట్‌ డ్రెస్‌లో మెరిశారు. ఆయన పంచుకున్న ఫొటోను.. రెండు గంటల వ్యవధిలోనే 8.5 లక్షల మంది లైక్‌ చేయడం విశేషం. మరోపక్క ఈ పార్టీలో తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. స్నేహ తన శ్రేయోభిలాషులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వీటిని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు.

టాలీవుడ్‌ అందమైన జంటల్లో బన్నీ-స్నేహ ఒకరు. 2011లో వీరి వివాహం జరిగింది. ఇద్దరి ప్రేమకు చిహ్నంగా అయాన్‌, అర్హ జన్మించారు. స్నేహ అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. ఆ సమయంలో ఓ పెళ్లికి హాజరైన ఆమెను బన్నీ చూశారు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అల్లు అర్జున్‌ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘అల వైకుంఠపురములో..’తో హిట్‌ అందుకున్న ఆయన దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’లో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని