మాస్క్‌ ఒక్కటే సరిపోదు.. - Masks Alone May Not Stop Covid-19 Spread Without Physical Distancing
close
Published : 23/12/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ ఒక్కటే సరిపోదు..

దిల్లీ: మాస్క్‌ ఒక్కటే ధరించడం వల్ల కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ లభించదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ‘ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధనా వ్యాసంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీనికోసం పరిశోధకులు వివిధ రకాల మాస్కులను పరీక్షించారు. అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పరిశోధకుల్లో ఒకరైన కోట కృష్ణ మాట్లాడుతూ.. మాస్కులతో పాటు భౌతిక దూరం పాటించినప్పుడే కరోనా వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. మాస్కులు ధరించి గుంపులుగా గుమికూడటం వల్ల కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువని ఆయన తెలిపారు. ఈ పరిశోధన కోసం తుంపరలు వెదజల్లే ఒక యంత్రాన్ని వినియోగించారు. ఇక్కడ వివిధ రకాల మెటీరియల్స్‌తో తయారైన మాస్కులపై తుంపరలు ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరీక్షించారు. సాధారణ బట్టతో తయారైన మాస్కు నుంచి ఎన్‌-95 మాస్కు వరకూ వారు పరిశీలించారు. సాధారణ బట్టతో తయారైన మాస్కులు 3.6శాతం తుంపరలను ఆపుతుండగా, ఎన్‌-95 మాస్కులు వందశాతం ఆపుతున్నాయని వారు తెలిపారు. కొవిడ్‌-19 వ్యాపించిన వ్యక్తికి దగ్గరగా ఉండి మాస్కులు ధరించినా అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని తెలిపారు. సాధారణంగా ఒకసారి తుమ్మినపుడు 200 మిలియన్ల వైరస్‌ అణువులు విడుదలవుతాయని వారు తెలిపారు. వైరస్‌ సోకని వ్యక్తులు కూడా మాస్కులు ధరించి వీలైనంత దూరంగా ఉండి మాట్లాడటం శ్రేయస్కరమని పరిశోధకులు వెల్లడించారు.

ఇవీ చదవండి..

కరోనా అక్కడికీ దూరిపోయింది!

కరోనా వేళ..జల్లికట్టుకు అనుమతిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని