close

తాజా వార్తలు

Published : 29/11/2020 09:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓటీటీ ఆఫర్‌ వాస్తవమే: మాస్టర్‌ టీమ్‌

విడుదల గురించి స్పందించిన నిర్మాణ సంస్థ

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మాస్టర్‌’ రిలీజ్‌ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొని ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ తరుణంలో సినిమా విడుదల గురించి చిత్రబృందం అధికారికంగా స్పందించింది. ఓ ప్రముఖ ఓటీటీ సర్వీస్‌ నుంచి తమకి ఆఫర్‌ వచ్చిన మాట వాస్తవమేనని.. కాకపోతే ‘మాస్టర్‌’ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్నామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. థియేటర్‌ యజమానులు తమకి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించాలని ‘మాస్టర్‌’ టీమ్‌ కోరింది.

‘కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇంకా మనం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాం. ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్లలోనే చూసి ఎంజాయ్‌ చేయాలనే మీ ఆశని అర్థం చేసుకున్నాం. ‘మాస్టర్‌’ సినిమా విడుదల గురించి గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై స్పందించాలని మేము నిర్ణయించుకున్నాం. ‘మాస్టర్‌’ రిలీజ్‌ గురించి ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి మాకు ఆఫర్‌ వచ్చిన మాట వాస్తవమే.. కానీ మేము మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన సంక్షోభం నుంచి ఇండస్ట్రీ బయటపడడానికి థియేటర్‌ రిలీజ్‌లు ఎంతో అవసరం. తమిళ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించేందుకు థియేటర్‌ యజమానులు సైతం మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఓ గుడ్‌న్యూస్‌తో త్వరలోనే మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాం’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా మెప్పించనున్నారు. ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. అనిరుధ్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ‘మాస్టర్‌’ టీజర్‌ అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. 40 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని