మయాంక్‌ శతకం.. రాజస్థాన్‌ లక్ష్యం 224 - Mayank Agarwal century helps punjab to set huge target for Rajasthan
close
Updated : 27/09/2020 21:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మయాంక్‌ శతకం.. రాజస్థాన్‌ లక్ష్యం 224

అర్ధశతకంతో మెరిసిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌

షార్జా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌(106; 50 బంతుల్లో 10x4, 7x6), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(69; 54 బంతుల్లో 7x4, 1x6) ఆది నుంచీ బౌండరీలతో అలరించారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్‌కు పంజాబ్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా 183 పరుగులు జోడించారు. శతకం బాది జోరు మీదున్న మయాంక్‌ 16.3 ఓవర్‌లో టామ్‌కరన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి కీపర్‌ సంజూ శాంసన్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌.. అంకిత్‌ రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద శ్రేయస్‌ గోపాల్‌ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్‌ 194 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఇక చివర్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌(13; 9 బంతుల్లో 2x4), నికోలస్‌ పూరన్‌(25; 8 బంతుల్లో 1x4, 3x6) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో పంజాబ్‌.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని