మెదక్‌ అదనపు కలెక్టర్‌ అరెస్ట్‌ - Medak Additional Collector Nagesh Arrested by ACB
close
Updated : 09/09/2020 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెదక్‌ అదనపు కలెక్టర్‌ అరెస్ట్‌

మెదక్‌‌: ఓ రైతు నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేసిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సహా నర్సాపూర్‌ ఆర్డీవో అరుణ, తహశీల్దార్ సత్తార్‌, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను అనినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. మెదక్‌ మండలం మాచవరంలోని అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అనిశా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. అనంతరం అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి సంబంధించి ఎన్‌వోసీ ఇవ్వాలని మూర్తి ఇటీవల అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను సంప్రదించారు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు తనకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ డిమాండ్‌ చేశాడు. ఇప్పటికే రూ.40లక్షల నగదు తీసుకున్న ఆయన.. మరో రూ.72లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని తన బినామీ జీవన్‌గౌడ్‌ పేరుమీద అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. ఈనేపథ్యంలో రైతు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించి తాజాగా అరెస్ట్‌ చేశారు.
ఇదీ చదవండి..

ఏసీబీ అదుపులో మెదక్‌ అదనపు కలెక్టర్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని