చంచల్‌గూడ జైలుకు అ‘ధన’పు కలెక్టర్‌ నగేశ్‌ - Medak additional collectro Nagesh bribe case update
close
Published : 11/09/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంచల్‌గూడ జైలుకు అ‘ధన’పు కలెక్టర్‌ నగేశ్‌

హైదరాబాద్: ఓ రైతు నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేసిన కేసులో అరెస్టయిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకముందు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి నిందితులకు ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

112 ఎకరాల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ.40లక్షలు తీసుకొని ఐదెకరాలను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేలా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో నగేశ్‌తో పాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం అహ్మద్‌, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

రూ.1.12 కోట్ల లంచం... అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని