‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’: తారక్‌, చరణ్‌ పాత్రల్లో వీరే..! - Meet the child artists of RRR
close
Published : 29/09/2020 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’: తారక్‌, చరణ్‌ పాత్రల్లో వీరే..!

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (రౌద్రం.రణం.రుధిరం) సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. అది సరే.. మరి చిత్రంలో బాల నటులు ఉన్నారా?.. ఉంటే, వాళ్లెవరు?.. మరోపక్క ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సెట్‌లో జక్కన్న, తారక్‌, చెర్రీతో కలిసి చిన్నారులు దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాల నటులు చక్రి, వరుణ్‌ బుద్ధదేవ్‌, స్పందన చతుర్వేది ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్పందన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌లో అందమైన మధురజ్ఞాపకాలు.. దీన్ని ఆశీర్వాదంగా ఫీల్‌ అవుతున్నా’ అని పేర్కొంది. ఈ మేరకు పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి.

బాల నటుడు చక్రి ‘ప్రతి రోజూ పండగే’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాల్లో నటించాడు. అతడు జక్కన్న సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. కొమరం భీమ్‌ (తారక్‌) చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నట్లు తెలిపాడు. దీంతో అల్లూరి సీతారామరాజు (చరణ్‌) చిన్నప్పటి పాత్రను మరో బాల నటుడు వరుణ్‌ బుద్ధదేవ్‌ పోషిస్తున్నాడేమోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సీత (అలియా భట్‌)గా స్పందన నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ రాశారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌, శ్రియ అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని