మెగా కాంపౌండ్‌లో మరో పెళ్లి..! - Mega Hero Saidharam Tej On Allu Sirish Wedding
close
Updated : 16/12/2020 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా కాంపౌండ్‌లో మరో పెళ్లి..!

బయటపెట్టిన హీరో

హైదరాబాద్‌: నిహారిక-చైతన్యల వివాహంతో ఇటీవల మెగా వారింట్లో పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మెగా కాంపౌండ్‌ నుంచి మరో పెళ్లి కబురు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ బయటపెట్టారు. వచ్చే ఏడాదిలో తమ కుటుంబంలో మరో పెళ్లి జరగవచ్చని ఆయన అన్నారు.

నిహారిక వివాహం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ పెళ్లి చేసుకోనున్నారని.. పెళ్లికుమార్తె కూడా ఫిక్స్‌ అయ్యిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ అవాస్తమని సాయిధరమ్‌ తేజ్‌ ఓ సందర్భంలో చెప్పారు కూడా. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి మరోసారి తాజాగా ఆయన స్పందించారు. తనకంటే ముందు అల్లు శిరీష్‌ వివాహం జరగవచ్చన్నారు. ‘శిరీష్‌ నాకంటే పెద్ద. తను వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్దకొడుకుగా నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి. పైగా పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి ఎన్నో మిస్‌ అయ్యాను. చాలా కలలున్నాయి. ముందు వాటిని నెరవేర్చుకోవాలి’ అని సమాధానం ఇచ్చారు. దీంతో త్వరలోనే మెగా కాంపౌండ్‌ నుంచి మరో పెళ్లి కబురు రానుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇవీ చదవండి

నిహారికని మా అమ్మలాగే చూస్తాం

నిహారికను చూస్తే కన్నీళ్లు వచ్చేశాయ్‌..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని