చిరు న్యూలుక్‌: సోషల్‌ మీడియాలో వైరల్! - Megastar Chiranjeevi new look goes viral
close
Published : 23/07/2020 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు న్యూలుక్‌: సోషల్‌ మీడియాలో వైరల్!

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ప్రతి విషయంపైనా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌పైనా అభిమానులు, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. క్లీన్‌ షేవ్‌తో మీసాలు కూడా తీసేసి దిగిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. చాలా రోజుల తర్వాత చిరు ఇలా క్లీన్‌షేవ్‌తో కనిపించడం విశేషం. మరి సరదాగా ఇలా ఫొటో దిగారా? లేక ఏదైనా కొత్త సినిమా కోసం ఫొటో షూట్‌లో భాగంగా క్లిక్‌మనిపించారా? తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

చిరు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేశారు. కరోనా ఉద్ధృతి వల్ల అది వీలు కాలేదు. వచ్చే నెలలోనే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అందుకే చిరంజీవి కసరత్తులు ముమ్మరం చేశారు. ఆయన జిమ్‌లో చెమటోడుస్తున్నారు. మరోపక్క సినిమా కోసం సెట్స్‌ని తీర్చిదిద్దేందుకూ సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. దేవాలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల కోసం సెట్స్‌ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించారు. ఇది పూర్తయిన వెంటనే సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కే ‘లూసిఫర్‌’ రీమేక్‌లో గానీ, బాబీ చెప్పిన కథతో గానీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని