చిరు.. పవన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ - Megastar Chiru Boyapati Srinu AnilRavipudi participated in Green india Challenge
close
Published : 26/07/2020 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు.. పవన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు స్వీకరిస్తున్నారు. కేవలం వారు స్వీకరించడమే కాదు, ఇతరులూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి అగ్ర కథానాయకుడు చిరంజీవి, ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు తమవంతు పాత్ర పోషించాలని చిరు, పవన్‌లు పిలుపునిచ్చారు. వీరితో పాటు, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడిలు కూడా పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని అందరికీ స్ఫూర్తినిచ్చిన చిరు.. పవన్‌లకు ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నటుడు అల్లరి నరేష్‌ కూడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని