టెన్నిస్‌ బంతుల్లో గంజాయి.. జైల్లోకి విసరబోయి! - Men Attempt To Throw Drug Filled Tennis Ball Inside Maharashtra Jail Arrested
close
Published : 12/11/2020 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెన్నిస్‌ బంతుల్లో గంజాయి.. జైల్లోకి విసరబోయి!

పుణె: జైల్లో ఉన్న తమ సహచరులకు మాదకద్రవ్యాలను అందించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్న నలుగురు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. గంజాయి నింపిన టెన్నిస్‌ బంతులతో జైలు ఆవరణలో పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలోని కలంబ జైలు పరిసరాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జైలు పరిసరాల్లో సిబ్బంది బుధవారం గస్తీ నిర్వహిస్తుండగా.. నలుగురు వ్యక్తులు చేతిలో టెన్నిస్‌ బంతులు పట్టుకుని అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వారి వద్ద ఉన్న బంతుల్లో గంజాయి నింపుకొని ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితులు వాటిని జైలులో ఉన్న తమ స్నేహితులకు పంపే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ బంతుల్లోని గంజాయిని సీజ్‌ చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. అనంతరం వారిపై మాదకద్రవ్యాల చట్టం(ఎన్‌డీపీఎస్‌) కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితులు ఇదువరకే జైల్లోని ఖైదీలను మత్తు పదార్థాలు ఏమైనా సరఫరా చేశారా లేదా అనే విషయమై అధికారులు తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని