ఇలాంటి జట్టుతో భారత్‌కు ప్రపంచకప్పా?   - Michael Vaughan criticises Team India cant win World cup with this batting lineup
close
Updated : 29/11/2020 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలాంటి జట్టుతో భారత్‌కు ప్రపంచకప్పా?  

లండన్‌: భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో లోతు లేదని, ప్రస్తుత జట్టుతో ప్రపంచకప్‌ గెలవడం కష్టమని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అన్నాడు. ‘‘ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం లేకపోవడమే భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. ఆ జట్టుకు కనీసం ఆరు లేదా ఏడుగురు బౌలర్లు ఉండాలి. బ్యాటింగ్‌ లైనప్‌లో లోతు లేకపోవడం కూడా ఆ జట్టుకు సమస్యే’’ అని చెప్పాడు. ‘‘ప్రపంచకప్‌ ఇంకా చాలా దూరంలో ఉందని నాకు తెలుసు. కానీ ఈ ఇప్పుడున్న కూర్పుతో భారత జట్టు ప్రపంచకప్‌ గెలుస్తుందని అనుకోను’’ అని వాన్‌ అన్నాడు. ‘‘ఐపీఎల్‌ చాలా ఏళ్లుగా ఉంది. టాప్‌-6లో బ్యాటింగ్‌ చేస్తూ బౌలింగ్‌ చేయగలిగే ఇద్దరు ఆటగాళ్లు లేదా ఓ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు అన్వేషించాల్సింది. హార్దిక్‌ బౌలింగ్‌ చేయడం మొదలుపెడితే భారత్‌ పరిస్థితి మెరుగుపడుతుంది’’ అని చెప్పాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని