గుంటూరులో హోటల్‌.. మాటలు కాదు..! - Middle class melodies film official trailer released
close
Updated : 10/11/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుంటూరులో హోటల్‌.. మాటలు కాదు..!

‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: గుంటూరులో హోటల్‌ పెట్టి, గొప్పవాడైపోవాలని ప్రయత్నిస్తున్నారు యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ. ఆయన, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. ఎ. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ షేర్‌ చేశారు. కచ్చితంగా ఈ చిత్రం అందరి హృదయాల్ని దోచుకుంటుందని, ఇప్పటికే తన కుటుంబంతో కలిసి సినిమా చూశానని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల్లోని పరిస్థితులు, మనుషుల స్వభావాల్ని ఈ ప్రచార చిత్రంలో చూపించారు.

‘నేను చెప్పానే, మా ఊర్లో బొంబాయి చట్నీ అదిరిపోద్దని.. చేసేది వీడే రాఘవ..’ అంటూ ఆనంద్‌ పాత్రను ఆరంభంలోనే పరిచయం చేశారు. ఆయన తండ్రి హద్దు, అదుపు లేకుండా అందర్నీ తిడుతూ కనిపించారు. ‘రాఘవ.. మీ నాన్నకు ఇంత ఆవేశం పనికిరాదయ్యా..’ అని డాక్టర్లు చెప్పే స్థాయికి బీపీ చేరుతుంది. ‘ప్రతి ఒక్కడు టౌన్‌కు వెళ్తా, టౌన్‌కు వెళ్తా అనడం ఫ్యాషన్‌ అయిపోయిందే..’ అని ఊరిలో వాళ్లు ఆనంద్‌ను ఎత్తిపొడుస్తుంటారు. ఈ పరిస్థితుల మధ్య ఆయన తన పల్లెటూరు వదిలి.. గుంటూరుకు వెళ్లి హోటల్‌ పెడతాడు. ఇలా సరదా సన్నివేశాలతో, ఆసక్తికరంగా  ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. నవంబరు 20న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని