సీఎం సంతకం చేయాల్సిన అవసరమేంటి? - Minister Narayana Swamy Comments On Tirumala Declaration Issue
close
Updated : 28/09/2020 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం సంతకం చేయాల్సిన అవసరమేంటి?

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం ఏంటని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. అలిపిరి పాదాల మండపం వద్ద రూ.25కోట్ల వ్యయంతో తితిదే, రిలయన్స్‌ సౌజన్యంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలిపిరి సమీపంలో రూ.20కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) నూతన కార్యాలయాన్ని తితిదే ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డితో కలిసి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..నుదుటన గోవింద నామాలు పెట్టుకుని శ్రీవారి ఆలయంలోకి సీఎం జగన్‌ వెళ్లారని గుర్తు చేస్తూ..అంతకంటే డిక్లరేషన్‌ ఏముంటుందని ప్రశ్నించారు. ఎస్సీలకు అధిక ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ప్రతిపక్షాలకు వేరే ఆస్కారం లేకనే గుడులు, గోపురాలపై రాజకీయాలు చేస్తున్నాయని నారాయణస్వామి మండిపడ్డారు. 

ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ ఎస్వీబీసీ ఛానల్‌! 
ఆరు నెలల్లో అలిపిరి కాలినడక మార్గం అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రిలయన్స్ సంస్థను కోరినట్లు తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు. నడకమార్గం పొడవునా నూతన షెడ్ల నిర్మాణం, శౌచాలయాల ఏర్పాట్ల వల్ల అలిపిరి మార్గంలో స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఎస్వీబీసీ ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది వీక్షిస్తున్నారని తెలిపారు. పాలకమండలిలో చర్చించి త్వరలో ఎస్వీబీసీ ఛానల్‌ను ఇంగ్లీషు, హిందీ భాషల్లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి కల్యాణోత్సవానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణోత్సవం సహా వీలైనన్ని సేవలను ఆన్‌లైన్‌ చేయాలని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని