దిల్లీలోని అతిపెద్ద కొవిడ్‌-19 సెంటర్‌లో దారుణం - Minor Girl raped in South Delhis biggest covid care centre two arrested
close
Published : 25/07/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలోని అతిపెద్ద కొవిడ్‌-19 సెంటర్‌లో దారుణం

మైనర్‌ బాలికపై అత్యాచారం.. వీడియో రికార్డు

దిల్లీ: దేశంలోనే అతిపెద్ద కొవిడ్‌-19 కేర్‌ సెంటర్‌గా గుర్తింపు పొందిన దక్షిణ దిల్లీలోని సర్దార్‌ పటేల్‌ వైద్య శిబిరంలో దారుణం జరిగింది. ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు దాన్ని వీడియో తీయడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు ఆ బాలిక వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ప్రత్యేక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జులై 11న సదరు బాలికకు వైరస్‌ నిర్ధారణ కావడంతో అదే రోజు ఆమె సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లింది.

అక్కడే మరో యువతి పరిచయం కాగా, ఆమె మరో ఇద్దరు యువకులను ఆ బాలికకు పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో జులై 15 అర్ధరాత్రి బాలిక వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆమెను బంధించి ఆ ఇద్దరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. అందులో ఒకరు వీడియో కూడా తీశాడని బాలిక పేర్కొంది. అయితే, ఈ ఘటనలో ఆ బాలికకు పరిచయం చేసిన యువతి ప్రమేయం ఏమైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, దిల్లీలో ఇప్పటివరకు 1,27,364 మంది వైరస్‌ బారిన పడ్డారు. అందులో 3,745 మంది మృతి చెందగా 1,09,065 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 14,554 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని