మీర్జాపుర్‌ -2 ట్రైలర్‌ విడుదల - Mirzapur 2 trailer out: Gaddi pe baithne wala kabhi bhi niyam badal sakta hai
close
Updated : 06/10/2020 21:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీర్జాపుర్‌ -2 ట్రైలర్‌ విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ మీర్జాపుర్‌ రెండో సీజన్‌ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అక్టోబర్‌ 23న విడుదల కాబోతుంది. ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిధ్వానీ ఈ సిరీస్‌కు నిర్మాతలుగా వ్యవహరించారు. గుర్మీత్‌ సింగ్‌, మిహిర్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించారు. మీర్జాపుర్‌ మొదటి భాగం అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సిరీస్‌లోని మలుపులు వెబ్‌ సీరిస్‌లను ఇష్టపడే వారిని ఆకట్టుకున్నాయి. సీజన్‌-2 పొలిటికల్‌ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కింది. ట్రైలర్‌ విడుదలకంటే ముందుగానే ఈ వెబ్‌ సిరీస్‌ నుంచి ఒక డైలాగ్‌ ప్రోమోని నిర్మాతలు విడుదల చేశారు. ‘ఎక్కడైతే ముగిసిపోయిందో అక్కడే తిరిగి ప్రారంభమవుతుంది’ అనే డైలాగ్‌ ఈ ప్రోమోలో ఉంది. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని