కీర్తిసురేశ్‌తో జగపతిబాబుకి ఉన్న వైరమేంటి? - Miss India Trailer Out
close
Updated : 24/10/2020 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తిసురేశ్‌తో జగపతిబాబుకి ఉన్న వైరమేంటి?

‘మిస్‌ ఇండియా’ అంటే ఒక బ్రాండ్‌ అంటోన్న నటి

హైదరాబాద్‌: ‘‘మిస్‌ ఇండియా’ అంటే నేను కాదు. ఒక బ్రాండ్‌’ అని అంటున్నారు నటి కీర్తి సురేశ్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, నధియా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. త్వరలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. దసరా పండుగ సందర్భంగా తాజాగా ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన కీర్తి.. విదేశాలకు వెళ్లి వ్యాపారం చేయాలనే తన కలను ఎలా సాకారం చేసుకోగలిగింది, ఈ క్రమంలో సమస్యలను ఎలా అధిగమించింది.. అనే విషయాలను తెలియజేసేలా ‘మిస్‌ ఇండియా’ తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కీర్తి తల్లిగా నదియా నటించారు. ట్రైలర్‌ ప్రారంభంలో కీర్తిని ఉద్దేశిస్తూ.. ‘నువ్వు నిజానికి చాలా దూరంగా.. అబద్ధానికి చాలా దగ్గరగా బతుకుతున్నావ్‌. నువ్వు, అన్నయ్యా జాబ్‌ చేస్తే తప్పా మన ఇల్లు సరిగ్గా గడవదు. అలాంటిది నువ్వు బిజినెస్‌ చేయడం..’ అంటూ నదియా చెప్పిన డైలాగ్‌ మధ్య తరగతి జీవిత కష్టాలను తెలియజేసేలా ఉంది.

కాగా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ‘మిస్‌ ఇండియా’ పేరుతో విదేశాల్లో ఇండియన్‌ టీ బిజినెస్‌ను ప్రారంభించిన కీర్తి సురేశ్‌కు తన ప్రత్యర్థి కంపెనీ కేఎస్‌కే యజమాని జగపతిబాబుతో వైరం ఏర్పడుతుంది. వ్యాపారం విషయంలో వారిద్దరి మధ్య ఉన్న పోటీని తెలియజేసే విధంగా ట్రైలర్‌లో చూపించిన పలు సన్నివేశాలు.. డైలాగ్‌లు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని