కోహ్లీతోనే షమి స్వదేశానికి! - Mohammed Shami ruled out of remaining Australia Tests
close
Updated : 21/12/2020 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీతోనే షమి స్వదేశానికి!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత అభిమానులకు చేదువార్త. గాయం కారణంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమి ఆస్ట్రేలియా సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ వేసిన షార్ట్‌పిచ్ బంతి షమి మణికట్టుకు బలంగా తాకిన విషయం తెలిసిందే. దీంతో అతడు విపరీతమైన నొప్పితో విలవిలలాడాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. అయితే స్కానింగ్‌లో అతడి మణికట్టులో పగుళ్లు వచ్చినట్లు సమాచారం. అతడు కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని, విరాట్ కోహ్లీతో కలిసి స్వదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పితృత్వ సెలవుల కారణంగా కోహ్లీ ఇంటికి వస్తున్న విషయం తెలిసిందే.

బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులకు ఇబ్బంది పెట్టే షమి జట్టుకు దూరమవ్వడం టీమిండియాకు ప్రతికూలాంశమే. ఇప్పటికే ఇషాంత్‌ శర్మ దూరమయ్యాడు. ఈ సమయంలో అనుభవజ్ఞుడు షమి కూడా అందుబాటులో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది. అయితే షమి స్థానంలో నటరాజన్‌, శార్దూల్ ఠాకూర్‌లో ఒకరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైన వారిద్దరు బ్యాకప్‌ ప్లేయర్లుగా జట్టుతోనే ఉన్నారు. వారితో పాటు కార్తిక్‌ త్యాగి కూడా నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. అయితే షమి గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు తొడకండరాల గాయం, కంకషన్‌తో తొలి టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్‌ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.

ఇవీ చదవండి

కోహ్లీసేనను రక్షించాలంటే ద్రవిడ్ వెళ్లాల్సిందే!

పృథ్వీ షా వద్దు..రాహుల్‌ రావాల్సిందే

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని