చిరు ‘లూసిఫర్’కు సారథి ఖరారు - Mohan Raja will Direct lucifer
close
Updated : 16/12/2020 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు ‘లూసిఫర్’కు సారథి ఖరారు

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి 153వ చిత్రం ‘లూసిఫర్‌’కు ఎట్టకేలకు సారథిని ఖరారు చేసింది చిత్ర బృందం. రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ‘ధృవ’ సినిమా తమిళ మాతృక ‘తనిఒరువన్‌’కు దర్శకత్వం వహించిన మోహన్‌రాజ్‌.. మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌ను తెలుగులో చిరు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చిరు.. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగానే తన తర్వాతి సినిమానూ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

జనవరి చివరిలో ప్రారంభించి మూడునెలల్లో చిత్రీకరణ పూర్తి చేస్తామని చిత్రబృందం తెలిపింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్’ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో విజయవంతమైన పలు సినిమాలను తమిళంలో రీమేక్‌ చేశారాయన. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘హిట్లర్‌‘కు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ప‌ని చేశారు. ఇన్నాళ్లకు మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి..

చిరు గొప్ప వ్యక్తి.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు: శివమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని