చిరు బర్త్‌డే: మోహన్‌బాబు గిఫ్ట్‌ చూశారా? - Mohan babu sent special gift for Chiranjeevi birthday
close
Updated : 23/08/2020 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు బర్త్‌డే: మోహన్‌బాబు గిఫ్ట్‌ చూశారా?

హైదరాబాద్‌: శనివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా విలక్షణ నటుడు మోహన్‌బాబు కూడా చిరుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదండోయ్‌ ఒక స్పెషల్‌ గిఫ్ట్‌ను కూడా పంపారు.

ఇదిగో అదే ఈ గిఫ్ట్‌. చెక్కతో తయారు చేసిన హర్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ను చిరు పుట్టినరోజు కానుకగా మోహన్‌బాబు పంపారు. ‘‘నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టి పడుతున్నాయి. థాంక్యూ’’ అని హర్లీడేవిడ్‌ సన్‌ పక్కన రాజసంగా నిలబడిన ఫొటోను చిరు షేర్‌ చేశారు. మోహన్‌బాబు పంపిన గిఫ్ట్‌ అద్భుతంగా, చూడముచ్చటగా ఉందంటూ ఇటు చిరు, అటు మోహన్‌బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు దేవాదాయ, ధర్మదాయశాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని సమాచారం. అందుకు తగినట్లుగానే మోషన్‌ పోస్టర్‌ ఉంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా చిత్రీకరణ వాయిదా పడింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని