లక్ష్మికి మోహన్‌బాబు స్పెషల్‌ విషెస్‌ - Mohanbabu Spl Wishes To His Daughter
close
Published : 08/10/2020 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్ష్మికి మోహన్‌బాబు స్పెషల్‌ విషెస్‌

మళ్లీ జన్ముంటే నువ్వే కూతురుగా పుట్టాలి..!

హైదరాబాద్‌: ‘మళ్లీ జన్మంటూ ఉంటే నువ్వే నా కుమార్తెగా పుట్టాలని దేవుడ్ని కోరుకుంటాను’ అని నటుడు మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. తన కుమార్తె మంచులక్ష్మిని ఉద్దేశిస్తూ ఆయన ఆ ట్వీట్‌ చేశారు. గురువారం లక్ష్మి పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ట్విటర్‌ వేదికగా ఆమెకి ప్రత్యేకంగా విషెస్‌ చెప్పారు. లక్ష్మి చిన్ననాటి ఫొటోని షేర్‌ చేసిన ఆయన.. ‘వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న.. పుట్టినరోజు ఈరోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మినే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాల్ని ప్రార్థిస్తున్నాను, హ్యాపీ బర్త్‌డే టు మై డియర్‌ లవ్లీ లక్ష్మిమంచు’ అని పేర్కొన్నారు.

‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ సినిమా తర్వాత ‘మిస్సెస్‌.సుబ్బలక్ష్మి’ వెబ్‌సిరీస్‌లో మంచులక్ష్మి నటించారు. ప్రస్తుతం ఆమె ‘కమ్‌ బ్యాక్‌ టు లైఫ్‌ విత్‌ లక్ష్మి మంచు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రామ్‌ ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల లక్ష్మి ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు. ‘పలు రంగాలకు చెందిన మీ అభిమాన వ్యక్తులు.. కొత్త జీవనవిధానానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు..! ఆ విషయాలు తెలుసుకోవాలంటే కొంచెం వేచి ఉండండి’ అని ఆమె పోస్ట్‌ చేశారు. మరోవైపు మోహన్‌బాబు ప్రస్తుతం ‘సూరరై పొట్రు’ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని